Sunday, June 17, 2012

ప్రేమలో కూడా మోసముంది


నిన్ను ప్రేమిచాకే తెలిసింది ప్రేమలొ కూడా మోసముంది
ఇప్పుడే తెలుసుకున్నాను ప్రేమించే వారికి బాధే మిగులుతుంది
బాధ కలిగినప్పుడు ఓదార్చడానికి కన్నీరే తోడవుతుంది
ఎవ్వరితో చెప్పుకోలేని మూగ వెధన వేధిస్తుంది
నా ప్రేమలో ఆరాధనలో ఏమైనా లోపమైందా .? నా మనసు ఆలోచిస్తుంది

నీ జ్ఞాపకాలే విశ్రాంతి లేకుండా నా వెంట తిరుగుతున్నాయి
నీ ఆలోచనలే మనసంతా వున్నాయి
విరామం లేకుండా కురుస్తున్న కన్నీటి ధారాలు ఆగకముందే చచ్చిపోతానేమో
నీ పాదాల కింద పూడ్చ బడుతానేమో
నిన్ను చూడకుండా చచ్చిపోతానేమో
నువ్వు ఈ జన్మకు కనికరం చూపవేమో...?

నన్ను మరువలేదని ఒక లేఖలోనైనా రాసెయ్యు జీవితాంతం బ్రతికేస్తాను
నన్ను మరుచాననె మాట  కలలో కూడా చెప్పకు బ్రతికే జీవితం ముగించేస్తాను.
 




No comments: