ఒక్కసారి ఆలోచించు
మహిళా ప్రభంజనం.. మద్యం వ్యాపారులు పలాయనం..!
కడపజిల్లా పెద్దపసుపుల గ్రామంలో మద్యం దుకాణం తొలగించాలని మహిళల సంఘటిత
పోరాటం విజయఢంకా మోగించింది. మద్యం షాపు కోసం ఒక్కడంటే ఒక్కడు దరఖాస్తు
వేసే సాహసం చేయలేదు. మహిళలు చీపుర్లు, చాటలు చేతబూని ఒక్కొక్కడికీ "ఉక్క"
పోయించారు.
ఈ చైతన్యం ఊరూరా వెల్లివెరిస్తే ఎంత బావుంటుందో కదా... ఏమంటారూ..?
*****88-----------------------------------88888------------------------------88888*****
Sameer Vijay
వై.కా.పా ముందున్న సవాళ్ళు
BY SAMBARGAADU JUNE 26, 2012 2013 CHALLENGES YSRCP
1 Vote
వైకాపా కు ప్రజాబలం మెండుగా ఉన్నప్పటికి -ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైకాపాకు
పట్టం కట్టడానికి అశేష ప్రజానీకం సంసిద్దంగా ఉన్నప్పటికి వై.కా.పా ముందు
కొన్ని సవాళ్ళు లెక పోలేదు. వీటిని అధికారంలోకి రావడానికి పూర్వం -అధికారం
చేపట్టాక అంటూ రెండు భాగాలుగా విభజించుకోవల్సి ఉంది.
అధికారంలోకి రావడానికి పూర్వం :
1.జగన్ జైల్లో ఉండడం – ఒక వేళ బెయిల్ లభించి భయిటపడినా అతని పై కొనసాగ గల కేసులు -మళ్ళీ అరెస్టులు అవి ఇవి:
ఇవన్ని కోర్టు పరిదిలో ఉన్న విషయాలు. వీటి పై పార్టి కాని,పార్టి నాయకులు,కార్యకర్తలు కాని చేయకలిగేది దాదాపుగా ఏమి లేదు.
అయితే కాంగ్రెస్ అదిష్ఠానం – సిబిఐ కుమ్మక్కు అయ్యాయనడానికి తిరుగులేని
ఆధారాలు లభించినట్టైతే కోర్టుల దృష్ఠికి తీసుకెళ్ళి న్యాయ పోరాటం
చెయ్యొచ్చు
అంతకంటే ముందు సి.బి.ఐ జెడి లక్ష్మినారాయణను సాగనంపేందుకు అటు లీగల్గా -ఇటు ప్రజాస్వామికంగా కూడ ప్రయత్నించాల్సి ఉంది.
జె.డి -చంద్రబాలల వైవాహిక జీవితాల కూపి లాగాలి. నాకేమో అవి ఇదివరకే బెడిసి
కొట్టి ఉంటాయనే అనిపిస్తూంది. చంద్రబాల భర్త రియల్ ఎస్టేట్ చేస్తున్నారట.
అతని కేరియర్,అతని సంపాదన ఏ మటుకున్నాయో కూపి లాగితే మన ఆరోపణకు మరింత భలం
చేకూరుస్తుంది.
ఇదీ కాక ఏబిఎన్ -జెడి కలిసి చంద్రబాలను కొరియర్గా
వాడుకున్నారా? లేక ఏ.బి.ఎన్ మాత్రమే వాడుకుందా? లేక చంద్రబాల
ఏబిఎన్-జె.డిలను వాడుకుని లబ్ధి పొందారా? అనే విషయాలను నిగ్గు
తేల్చుకోవల్సి ఉంది.
ఇందులో ఏ ఒకటి జరిగి ఉన్నా దాని తాత్పర్యాలు,ఉద్దేశాలు,దురుద్దే శాలు,లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి.క్రైం యొక్క తీవ్రతలో మార్పులు ఉంటాయి.
కాబట్టి వై.కా.పా తక్షణమే ఈ కుట్ర పై తన సర్వ శక్తులు ఒడ్డి సిటింగ్ హై కోర్టు న్యాయమూర్తిచే దర్యాప్తు జరిగేలా ఒత్తిడి తేవాలి.
ప్రజా సమస్యల పై పోరాడటం అనివార్యమే కాదనను. కాని ప్రజలకు ప్రస్తుతం ఉన్న
ఏకైక ప్రత్యామ్నాయం వై.కా.పా ఒక్కటే . అటువంటిది ఆ పార్టియొక్క ఉనికికే
ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి జె.డి – చంద్రబాల
ఉదంతం పై ద్రుష్ఠి సారించి తీరాల్సిందే.
2.రాష్ఠ్ర్రపతి ఎన్నికలు:
వై.కా.పా ముందున్న అవకాశాలు మూడే. 1.ప్రణబ్ 2.సంగ్మా3.ఎన్నికలను
భహిష్కరించడం ప్రణబ్ పక్షం వహిస్తే కాంగ్రెసుతో కుమ్మక్కయ్యామనే నింద
భరించాల్సి ఉంటుంది. సంగ్మా పక్షం వహిస్తేనేమో బా.జా.పాతో కలిసామన్న అపవాదు
వస్తుంది. అయితే మేము మద్దత్తిస్తున్నది బా.జ.పా అభ్యర్దికి కాదని
-ఎన్.డి.ఏ అభ్యర్దికేనని వాదించుకునే అవకాశం ఉంది.
ఎన్నికలను
భహిష్కరిస్తేనేమో “సిద్దాంతాలు లేని పార్తి” అన్న ప్రతిపక్షాల వాదనకు భలం
చేకూర్చినవారం అవుదాం. మరీ నాన్చకుండా సత్వరమే నిర్ణయం తీసుకోవల్సిన విషయం
ఇది.
నన్నడిగితే సంగ్మాను భలపరచడమే మేలు. భవిష్యత్తులో జాతీయ
రాజకీయాల్లో వై.కా.పా పాత్రకు ఇది శ్రీకారం కాగలదు.పైగా జగన్ విషయంలో
సి.బి.ఐ, అదిష్ఠానం వేదింపులు మరీ తారా స్థాయికి పెరిగినప్పుడు అందుకు
అడ్డుకట్ట వేసేందుకు ఎన్.డి.ఏ పక్షాలు గళం విప్పే అవకాశం ఉంటుంది.
3.ఎన్నికలకింకా రెండేళ్ళ కాలం ఉండడం:
ప్రజలేమో రోశయ్య ,కిరణ్ల తప్పుడు విదానాలతో – అస్తవ్యస్థ పరిపాలనతో విసిగి
వేసారి ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తుందా -కాంగ్రెసుకు చరమ గీతం పాడుదామా అని
ఉవ్విళ్ళూరుతున్నా – మరో రెండేళ్ళ కాలం ఈ కసి ఇలానే కొనసాగుతుందా అన్నది
ప్రశ్నార్థకమే.
పైగా విజయ దుందుభి మోగించిన మనమే ఇంతగా
ఆలోచిస్తున్నప్పుడు ఓటమి పాలైన వారు ఎంతగా ఆలోచిస్తారు – ఎన్ని కుట్రలు
కుతంత్రాలకు పాల్పడతారో చెప్పలేం.
ఒక వేళ అటు కేంద్రంలోను ఇటు రాష్ఠ్ర్రంలోను నాడు చంద్రబాబు చేసినట్టుగా కోటివరాలు ప్రకటించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళొచ్చు.
ఇక్కడ చిరంజీవిని సి.ఎం అభ్యర్దిగా – అక్కడ రాహుల్ను పి.ఎం అభ్యర్దిగా
ప్రకటించే అవకాశమూ లేక పోలేదు. ఒక వేళ తెలంగాణ ప్రకటించి టి.ఆర్.ఎస్ను తమ
పార్టితో విలీనం చేసుకున్నా ఆపేదెవరు?
అలానే వై.కా.పా నేతలు
-ద్వితీయ,తృతీయ శేణి నేతలు ,కార్యకర్తలు మరో రెండేళ్ళదాక ఇదే ప్రేరణతో,ఇదే
తేజంతో ఉంటారన్నది కూడ అనుమానమే. తె.దే.పా లాగా కుమ్మక్కు రాజకీయాలైతే
ఎన్ని దశాబ్దాల పాటైనా చెయ్యొచ్చు.
అసలు సిసలైన ప్రతిపక్ష పాత్రను పోషించడం – మరి ప్రభుత్వ,పోలీసు వేదింపులకు తట్టుకోవడం అంత తేలిక కాదు.
కాబట్టి ప్రజాభీష్థం మెరకు ఎంత త్వరగానైతే అంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని
కూలదోసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలి. పాలకపక్షాన్ని
బెంబేలెత్తించాలి. వారిని అభద్రతా భావానికి గురిచెయ్యాలి. వలసలను
ప్రోత్సహించాలి . ( అయితే ఈ వెల్లువలో కోవర్టులు ఎంటర్ అయిపోకుండా జాగ్రత్త
పడాలి సుమండి)
అధికారం చేపట్టాక:
వీటిని ఇలా పబ్లిక్
బ్లాగ్లో వ్రాయడం కన్నా కవర్లో పెట్టి వై.కా.పా గౌ.అధ్యక్షురాలికో /లేక
అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికో పంపడమే బెటర్ కాబట్టి .. సారి
2 comments:
Excellent Analysis.
mana rashtramlo anni jillaaaala aadawallu ila vunte enta bagundu ...
mahilasangaalavaalu ilaantivi cheyyaru endukano.?
Post a Comment