Sunday, February 26, 2012

నా ప్రేమ పాట

అందమైన నగరంలో నా ప్రేయసి కనిపించ రావా
నా  హృదయ పాటకు పల్లవి వినిపించారావా

ఎక్కడనుంచో మబ్బు గాలిలో చందమామల 
అందమైన  ప్రేయసి కోయిల గొంతుల
విరిసిన మల్లెల నువ్వున్నావు
సముద్రపు  నీటి మీద చుట్టు ముట్టిన పొగ మంచుల
నా హృదయ లేఖలో పదాలై అక్షరాలై చేరుకున్నావు

తెలిసి  తెలియని ఊహల్లో వున్నాను నీ ప్రేమను అందించ రావా
నీ కలల మత్తులో మునిగి వున్నాను
నువ్వే నా నీడ అని తెలప రావా
నువ్వు  లేని జీవితం ముగిసి పోతుందని వేదన పడుతున్నాను
ప్రేమ  అనే మరో జన్మ ప్రసాదించరావా

అందమంటే  తెలుసు నాకు అందుకే నిన్ను ప్రేమించింది
ప్రేమ విలువ తెలిస్తే నీకు నా ప్రేమ నిజమవుతుంది
నా హృదయంలొ నీ రూపం ఎపుడు వికసిస్తూనే వుంటుంది

నువ్వు  లేని నా ప్రేమ పాట 
నువ్వులేక  నా హృదయంలొ బాధ 
కళ్ళల్లో  కలవరింత
నిన్ను  చూస్తె ఆగాడు నా మానసిక

రెండు  హృదయాలు కలుస్తున్న వేల
వెల్లిపోతున్న   కాలం వెంబడి పరిగెడుతూ
నీ  కోసం ఒంటరితనం ఒంటె మీద ప్రేమ యాత్ర చేస్తూ
నా  హృదయ భావాలు వర్ణిస్తున్నా ఆలపించ రావా 

కోరుకున్నది  నీ ప్రేమను అవునంటే చంద్ర మండలాన్ని తాకుతాను
కాదంటే  భూస్థాపితం అయిపోతాను.......

Saturday, February 25, 2012

ప్రేయసి

ఎన్నోవేల ఆనందాలు తక్కువ అనిపిస్తున్నాయి

నా ప్రేమ ప్రేయసి ను మరిచిపోవడానికి..



ఒక  నా ప్రేమ ప్రేయసి బాదే సరి పోతుందేమో

నన్ను జీవితాంతం ఏడిపించడానికి

Friday, February 24, 2012

దూరమై"నా" ప్రేమ

నువ్వు లేని జీవితం వ్యర్థమని నీతో ఎలా చెప్పను
నా నయనాలు వర్షిస్తే అది నీ జ్ఞాపకమే ఎలా తెలుపను
నా అదృష్టమే ద్రోహి నువ్వు కాదు
నా అద్రుష్టానిదే దురదృష్టం నీ ప్రేమ కాదు
 నీ  ప్రేమతో విసిగిన దుఖం లో వున్నాను
నువ్వింకా రాలిపోయే పూలతోనే మాట్లాడుతున్నావా..

నీలి  ఆకశంలొ ఎత్తైన చెట్ల మధ్య తొంగి చూసే చంద్రుడిని చూసి
నీ రూపమే అనుకున్ననుగా
బద్దకంగా లేస్తున్న పావురాల రెక్కల చప్పుడు విని
నీ  పలకరింపుగా భ్రమ పడ్డానుగా

నేటికైనా ఏ నాటికైనా తిరిగి వస్తావనే ఆశతో
నీ  కోసమే వేచి వున్నాను
నువ్వు లేని జీవితం వ్యర్థమన్నాను
నా కోసం తిరిగి రావా  ప్రియా...

గాయ పర్చిన "ప్రేమ" గులాబి

ప్రేమించిన తర్వాత తెలిసింది నేను ఓ ద్రోహిని ప్రేమించానని
కళ్ళల్లో కనులు కలిపాక తెలిసింది ఆ నయనాలు నన్ను మోసం చేశాయని
అమాయకంగా వెలిగే ముఖం చూశాను కాని తేలి పోయింది మనసులో చీకతుందని
నా ప్రేమ దీపాన్ని అర్పించాక తెలిసింది ఆమె నా ప్రేమనూ ఆర్పి వేసిందని
హృదయం శూన్యమై కనులు వర్షించాక తెలిసింది నమ్మి మోసపోయానని

ఇతరుల గురించి మాట్లాడుతారు తెలుసా మీకు
నేను నా వారినే పరిక్షించానని
అందరు ముండ్లతొ భయ పాడుతారు తెలుసా మీకు
నేను అందమైన పువ్వుతో గాయ పడ్డానని

నమ్మకం వమ్మై పోయాక తెలిసింది నేను ఓ ద్రోహిని ప్రేమించానని
లేశాక తెలిసింది కాలం శ్రద్ధగ వింటున్న నా ప్రేమ కథ చెబుతు నేనే నిదురా పోయానని.

నీ ప్రేమ


ప్రేమించి ప్రేమించి నా మనసే బాధ పడుతుంది
ఎంత పెద్ద తప్పు చేశానో ఇంత పెద్ద శిక్ష విధిస్తుంది
కనులే కాదు నా మనసు కూడా దుఖిస్తుంది
నాశనమై పోయాను నిన్ను ప్రేమించినందుకే ఇలా జరిగింది
ఏమని చెప్పను ప్రియతమా నీ ద్రోహం నరకం చూపించింది

నేను కాదంటే విషమే బెటరన్నావు
నేను అవునంటే భూలోకమే స్వర్గమన్నావు
నేనే నీ ప్రాణమన్నావు
నేను లేకుంటే నువ్వు లేనన్నావు
ఇపుడేం జరిగింది చెలియా
నా ప్రేమే విశమయ్యిందా
నీ  ప్రేమ పరాయి వారికి పోయిందా
నీ ప్రేమ పరాయి వారికి పంచావు
బాధే  నాకు మిగిలించావు
ఎందుకిల నన్నే మోసం చేశావు..?

Thursday, February 23, 2012

దొరక"ని" ప్రేమ



ప్రేమించాలనుకుంటావు తప్పించుకోవాలని చూస్తావు
ఇలాంటి ప్రేమే నీద ఎలాంటి ప్రేమే నీది ...

నీ ప్రామిస్సులు ఆ కిస్సులు ఓ ప్రియ
అన్ని మరిపించేశావు నన్నే మోసం చేశావు 
నీ ప్రేమే అర్థం కాదు .. నా ప్రేమ ఏం తక్కువవలేదు..
ఒక  వైపు నేనే ప్రేమించాను.. నీ ప్రేమ కై అన్వేషించాను
ప్రేమ అమ్రుతమన్నావు.. విషం నన్నే తాగించావు..

జీవితాంతం నిదురే రాదు.. ఎవరిని ప్రేమించాలని లేదు..
దూరం నువ్వై పోయావు .. నిను మారవ లేక నేనున్నను
పరాయి వారి కోసం నా ప్రేమనె కాదన్నావు ..

నీ ప్రేమ అమృతంలా ఇచ్చవు.. అందులో విషం కొంచం కలిపావు 
ఇపుడు బ్రతకాలని లేదు నీ ప్రేమ విషం తాగాలని లేదు
జన్మ జన్మల మన ప్రేమ ఒక కళల తుంచేశావు
ఓ ప్రియ అన్ని మరిపించేశావు నన్నే మోసం చేశావు..

ప్రేరేమించాలనుకుంటావు తప్పించుకోవాలని చూస్తావు
ఇలాంటి ప్రేమే నీద ఎలాంటి ప్రేమే నీది ...


Thursday, February 16, 2012

కవిత్వం ఊహ నుండి పుడుతుందా...?

కవిత్వం ఊహ నుండి పుడుతుంద...
 అన్ని కవిత్వాలు అంతేన ..
అన్నింటికీ మూలం ఊహేనా..

ఊహ కాదు  అసలు రూపం వుంది..
తెలంగాణా వీరుల కోసం పుట్టింది ఓ కవిత్వం
బానిస బ్రతుకుల విముక్తి కోసం ఆవిర్భవించింది మరో కవిత్వం

స్పందింపజేసే  అనుభూతి క్షణం కాదని తేల్చేది కవిత్వం
ఆ అనుభూతి కోల్పోతే చెల్లించాల్సింది ఓ జీవితం అని నేర్పేది ఓ కవిత్వం
బాధల వలయంలో నుండి ఉప్పొంగేదే కవిత్వం
బ్రతుకు భారమై తిండిలేక మొహమాటం అడ్డొచ్చి కన్నీతిగా రాలేదే కవిత్వం
ప్రేయసి మోసంలో నుండి జ్వాలగా రగిలేది కవిత్వం
ప్రియుడి మనసులో రగిలే అగ్ని పర్వతమే కవిత్వం

కాని

నేను కాదు కవిని నేను రాసేది కాదు కవిత్వం
ఉహకు అందని నిజం -అదే నా అనుభావం
ప్రేమ కూడా పరిహాసం -ప్రేమలో కూడా వుంది మోసం
నా కల కోరిక
సర్వంగాలతో కూడిన అతి సుందరమైన పాలా రాతి శిల్పం
అందులో ప్రాణాలు కావలి అనుకోవడమే నేను చేసిన మూర్ఖత్వం

వికటించిన ప్రేమ
తీరని కళలు
నెరవేరని కోరికలు
మిగిలించాయి నయన వర్షం

హృదయంలో బాధ ఉప్పొంగుతుంది
పెదవిపై మాట తడబడుతుంది
ఎవరితో చెప్పుకోలేని దుఖం
కన్నీటిని ఆపే ప్రయత్నం
అప్పుడే వచ్చింది చేతులో ఖలం
బహుశ అదేనేమో కవిత్వం..