Saturday, June 23, 2012

వేదన

వచ్చిపో ఒక్క సారి వచ్చిపో
నా కంటిపాప నువ్వైపో
నా గుండె చప్పుడుగా నువ్వు మిగిలిపో 
నా కనురెప్పకూ కలగ మిగిలి పోతావా
నా మనసులో శాశ్వతంగా వుండిపో ప్రియా
అందమైన ఉదయమా లేలేత సూర్య కిరణమా
శూన్యమే నా గమ్యమ...


Friday, June 22, 2012

కలల ఆరాటం - కన్నీటి ఆలోచన

గోదావరి నది తీరాన నీతో గడిపిన సాయంకాలం
సంధ్య సమయాన సూర్య కిరణాలు నీపై పడుతువుంటే 
చూసి ఆనందించిన ఆ క్షణం
నీ పెదవి అందించిన వెచ్చదనం
స్వచ్చమైన గానం - అందమైన రూపం
ఊహకందని రాగం నాకది మధురాక్షణం
ఆ గానానికి తన రూపానికి పై అంతస్తు హృదయం నా ప్రియురాలిది

నా కనులు ప్రియురాలి కలలే ఆలపిస్తాయి
రేపటి సూర్యుడు నాకోసం కొత్త ఆనందాలు తెస్తాడని
నా ప్రియురాలు నా దగ్గరికే వస్తుందని
ఆలోచిండం ఆరాటపడటం
కలలు కనడం కన్నీరు కార్చటం నాకు   అలవాటు
నీ కలలే నాకు శరణ్యమా
ఇక కాదా నాకు నీ నా దర్శనం...

 

Wednesday, June 20, 2012

చెదిరిన స్వప్నం

చెదిరిన స్వప్నం నేర్పింది నాకో సత్యం
మనసు పొందిన గమ్యం 
చూపుతో కోల్పోయాను ఆ బంధం
నేను వెతికేది నీ కోసమేగా 
దొరికి దూరమయ్యావే ప్రియా
నేను నిన్ను మరిచానంటే ఒట్టు 
నువ్వు నన్ను మరిచావన్నది కరెక్టు
నా ప్రేమను కాదని కోలాహలం రేపేశావు
నవ్వుతు వుంటూనే నన్ను ముంచేశావు

నేను ఓడి పోయాను 
నా కలలు చెదిరి పోయాయి
నను వీడిపోవద్దు ప్రియతమ నా హృదయ గీతమ
కాదు అది నా కోరిక నా దరికి రావా ఇక...
దోచుకున్నావు నా మనస్సుని
 శూన్యంలొ నెట్టేశావు నా జీవితాన్ని
జీవితం పై విరక్తి కలిగింది 
నీ ప్రేమ మీద ఇంట్రస్టు పెరిగింది
ఉండిపొ నాతో ఎల్లప్పుడు...

ఇక నొప్పించకు నా మనస్సు నా ప్రేమకు ప్రాణం నువ్వు
కనులు మూసి బ్రతుకుతున్నాను నీ రూపం కనిపిస్తుంది
నేత్రాలు తెరిస్తే చాలు నరకం అగుపిస్తుంది
నిండి పోతుంది  ప్రేమ గాయం 
మళ్ళీ గుర్తొచ్చి నీ ప్రేమ నేస్తం
ఆ గాయం పోవట్లేదు 
నా ప్రేమ నిన్ను మరవట్లేదు



  

నీ పనితనమింతేన ప్రేమ



పిచ్చి మనసు ప్రేమించింది
ప్రేయసిని చూపించింది
చూడు చూడు మంది ప్రేయసిని
ఆకలే కానంది – నిదురే రానంది
కలలెన్నో కన్ననూ – తప్పునేనేం చేశాను
గుండెలో తుఫాను చెలరేగింది
కన్నీటి సునామి ఉప్పొంగింది
ప్రళయమేదో వచ్చింది
ప్రాణ వాయువునాపింది
బ్రతికి పొమ్మంది – బయట పడమంది
ప్రాణంతోనే పరిహాసమాడింది
ఆత్మని పోనివ్వదు – శాంతిని రానివ్వదు
నూవిచ్చే బహుమానమిదేన ప్రేమ
నీ పనితనమింతేన ప్రేమ

Monday, June 18, 2012

కానివ్వకు ప్రేమ కలుషితం

 
చూపు తోనే మొదలవుతుంది ప్రేమ
నిలువ వుంటుంది హృదయంలో ప్రేమ
కాదంటే బ్రతకనంటుంది  ప్రేమ
అవునంటే స్వర్గం అవుతుంది ప్రేమ
ప్రియురాలికి ఆరాధ్య దైవం  ప్రేమ
ప్రియుడికి జీవన వేదం  ప్రేమ
విరహమే కాదు శాంతి స్వరూపం ప్రేమ
యువతరం మెచ్చింది  ప్రేమ
ఈ తరానికి నచ్చింది  ప్రేమ
రానివ్వకూ ప్రేమలో విషాదం
కానివ్వకు కలుషితం ప్రేమ 
ప్రేమంటే కాదు విశం
ప్రేమంటే  అమృతం
ప్రేమకోసమే ఈ జీవితం...


Sunday, June 17, 2012

ప్రేమలో కూడా మోసముంది


నిన్ను ప్రేమిచాకే తెలిసింది ప్రేమలొ కూడా మోసముంది
ఇప్పుడే తెలుసుకున్నాను ప్రేమించే వారికి బాధే మిగులుతుంది
బాధ కలిగినప్పుడు ఓదార్చడానికి కన్నీరే తోడవుతుంది
ఎవ్వరితో చెప్పుకోలేని మూగ వెధన వేధిస్తుంది
నా ప్రేమలో ఆరాధనలో ఏమైనా లోపమైందా .? నా మనసు ఆలోచిస్తుంది

నీ జ్ఞాపకాలే విశ్రాంతి లేకుండా నా వెంట తిరుగుతున్నాయి
నీ ఆలోచనలే మనసంతా వున్నాయి
విరామం లేకుండా కురుస్తున్న కన్నీటి ధారాలు ఆగకముందే చచ్చిపోతానేమో
నీ పాదాల కింద పూడ్చ బడుతానేమో
నిన్ను చూడకుండా చచ్చిపోతానేమో
నువ్వు ఈ జన్మకు కనికరం చూపవేమో...?

నన్ను మరువలేదని ఒక లేఖలోనైనా రాసెయ్యు జీవితాంతం బ్రతికేస్తాను
నన్ను మరుచాననె మాట  కలలో కూడా చెప్పకు బ్రతికే జీవితం ముగించేస్తాను.
 




Saturday, June 16, 2012

మొదలయ్యింది కాలేజీ.

 కాలేజీ కాలేజీ దీని విలుయ తెలుసు ఈ తరానికి
కాలేజీ కాలేజీ అర్థం చెబుతుంది టీనేజికి
విలువ పెంచుతుంది రీడింగ్ కి

, ఆ ల నుండి ఎదిగి వచ్చాము కాలేజీకి
ABCD లు చదివి వచ్చాము ఈ స్థాయికి
విధ్య విజ్ఞానం నేర్పించె లెక్చరర్స్-మారుస్తారు మన జీవితాన్ని అఫిషియల్
పిల్లల తప్పులను మన్నిస్తారు-విధ్య విజ్ఞానం నేర్పిస్తారు

చదువుసునే వారికి దేవాలయం ఇది
విజ్ఞానం తో నిండిన తోట
అవుతుంది మన అందరి జీవన బాట
వుంచుకుందాము మన మనసులో చదువుల తల్లి రూపాన్ని
విడిపోకూడదు ఎన్నడు మన దేహాన్ని
చదువుకు అసలైన అర్థం చెప్పేది
మన గమ్యాన్ని దగ్గరకు చేర్చేది.

కాలేజీ కాలేజీ ఇక్కడే ర్యాగింగు మొదలయ్యేది
ర్యాగింగు అనేది ఓ పొగిడింత
కాకూడదు అమ్మాయిలకు పొడిచినమంట
కాకూడదు అబ్బాయిలకు మరచిపోనీ వ్యధ
సహించే వారికి ఆనందం
సహించని వారికి విషం లాంటిది

పుస్తకాలు చదివి బేజారెత్తిన స్టూడెంట్ కి
విశ్రాంతి కలిగించే బాతకానిల క్యాంపస్ ఇది
తొట్టి గ్యాంగ్ లకు స్థావరం
                              విధ్యార్థి సంగాలకు ప్రాణం ఇది
యూత్ ట్రెండ్ కి పునాది
బ్యాచిలర్ బాయ్స్ కు కన్నె గులాబిల కొలువిది
గల్స్ ను గగనానికి ఎత్తే పొగిడింతల ప్లస్ అది

రాగింగ్ టీసింగు వుండాలి సరదాగా ఓ క్షణం
కాకూడదు అదే విధ్యార్థి జీవితం
వుండాలి అందరికీ ఓ ఆశయం
అది సాధించడానికే వచ్చేది ఇక్కడ మనమందరం.