కవిత్వం ఊహ నుండి పుడుతుంద...
అన్ని కవిత్వాలు అంతేన ..
అన్నింటికీ మూలం ఊహేనా..
ఊహ కాదు అసలు రూపం వుంది..
తెలంగాణా వీరుల కోసం పుట్టింది ఓ కవిత్వం
బానిస బ్రతుకుల విముక్తి కోసం ఆవిర్భవించింది మరో కవిత్వం
స్పందింపజేసే అనుభూతి క్షణం కాదని తేల్చేది కవిత్వం
ఆ అనుభూతి కోల్పోతే చెల్లించాల్సింది ఓ జీవితం అని నేర్పేది ఓ కవిత్వం
బాధల వలయంలో నుండి ఉప్పొంగేదే కవిత్వం
బ్రతుకు భారమై తిండిలేక మొహమాటం అడ్డొచ్చి కన్నీతిగా రాలేదే కవిత్వం
ప్రేయసి మోసంలో నుండి జ్వాలగా రగిలేది కవిత్వం
ప్రియుడి మనసులో రగిలే అగ్ని పర్వతమే కవిత్వం
కాని
నేను కాదు కవిని నేను రాసేది కాదు కవిత్వం
ఉహకు అందని నిజం -అదే నా అనుభావం
ప్రేమ కూడా పరిహాసం -ప్రేమలో కూడా వుంది మోసం
నా కల కోరిక
సర్వంగాలతో కూడిన అతి సుందరమైన పాలా రాతి శిల్పం
అందులో ప్రాణాలు కావలి అనుకోవడమే నేను చేసిన మూర్ఖత్వం
వికటించిన ప్రేమ
తీరని కళలు
నెరవేరని కోరికలు
మిగిలించాయి నయన వర్షం
హృదయంలో బాధ ఉప్పొంగుతుంది
పెదవిపై మాట తడబడుతుంది
ఎవరితో చెప్పుకోలేని దుఖం
కన్నీటిని ఆపే ప్రయత్నం
అప్పుడే వచ్చింది చేతులో ఖలం
బహుశ అదేనేమో కవిత్వం..

1 comment:
very nice, kavithvam lo nundi meeru puttara?
meere kavithvanni puttisthunnara?
http://hytenz.blogspot.in/
Post a Comment