నువ్వు లేని జీవితం వ్యర్థమని నీతో ఎలా చెప్పను
నా నయనాలు వర్షిస్తే అది నీ జ్ఞాపకమే ఎలా తెలుపను
నా అదృష్టమే ద్రోహి నువ్వు కాదు
నా అద్రుష్టానిదే దురదృష్టం నీ ప్రేమ కాదు
నీ ప్రేమతో విసిగిన దుఖం లో వున్నాను
నువ్వింకా రాలిపోయే పూలతోనే మాట్లాడుతున్నావా..
నీలి ఆకశంలొ ఎత్తైన చెట్ల మధ్య తొంగి చూసే చంద్రుడిని చూసి
నీ రూపమే అనుకున్ననుగా
బద్దకంగా లేస్తున్న పావురాల రెక్కల చప్పుడు విని
నీ పలకరింపుగా భ్రమ పడ్డానుగా
నేటికైనా ఏ నాటికైనా తిరిగి వస్తావనే ఆశతో
నీ కోసమే వేచి వున్నాను
నువ్వు లేని జీవితం వ్యర్థమన్నాను
నా కోసం తిరిగి రావా ప్రియా...
No comments:
Post a Comment