అందమైన నగరంలో నా ప్రేయసి కనిపించ రావా
నా హృదయ పాటకు పల్లవి వినిపించారావా
ఎక్కడనుంచో మబ్బు గాలిలో చందమామల
అందమైన ప్రేయసి కోయిల గొంతుల
విరిసిన మల్లెల నువ్వున్నావు
సముద్రపు నీటి మీద చుట్టు ముట్టిన పొగ మంచుల
నా హృదయ లేఖలో పదాలై అక్షరాలై చేరుకున్నావు
తెలిసి తెలియని ఊహల్లో వున్నాను నీ ప్రేమను అందించ రావా
నీ కలల మత్తులో మునిగి వున్నాను
నువ్వే నా నీడ అని తెలప రావా
నువ్వు లేని జీవితం ముగిసి పోతుందని వేదన పడుతున్నాను
ప్రేమ అనే మరో జన్మ ప్రసాదించరావా
అందమంటే తెలుసు నాకు అందుకే నిన్ను ప్రేమించింది
ప్రేమ విలువ తెలిస్తే నీకు నా ప్రేమ నిజమవుతుంది
నా హృదయంలొ నీ రూపం ఎపుడు వికసిస్తూనే వుంటుంది
నువ్వు లేని నా ప్రేమ పాట
నువ్వులేక నా హృదయంలొ బాధ
కళ్ళల్లో కలవరింత
నిన్ను చూస్తె ఆగాడు నా మానసిక
రెండు హృదయాలు కలుస్తున్న వేల
వెల్లిపోతున్న కాలం వెంబడి పరిగెడుతూ
నీ కోసం ఒంటరితనం ఒంటె మీద ప్రేమ యాత్ర చేస్తూ
నా హృదయ భావాలు వర్ణిస్తున్నా ఆలపించ రావా
కోరుకున్నది నీ ప్రేమను అవునంటే చంద్ర మండలాన్ని తాకుతాను
కాదంటే భూస్థాపితం అయిపోతాను.......

No comments:
Post a Comment