Monday, March 26, 2012

మౌనం

నీ మాటలు అపశృతి పలుకుతున్నాయి
ఈ సమయాన  నీకు మౌనమే మంచిది
నీ మాటలను ఒక్క సారి ఆలోచించుకో
నీ మౌనంలో నా సమాధానం వుంటుంది

నాకు అందనంత దూరం వెళతావా
శూన్యంలొ నన్ను వాదులుతావా
నాలొ బాధలు ఆవరించి వుండగ
నువ్వు నన్ను విడిచి వెళ్లిపోతావా.?

Sunday, March 25, 2012

ఇదేనా ప్రేమ
ఇదే నా.! ప్రేమ.?


ఎలా మరువ మంటావు

ఇదేనా!  ప్రేమ.?
www.edenaprema.blogspot.com

నా నుండి విడిపోయావు
నా హృదయంలొ నీ రూపాన్నే మిగిలించావు
నా మనసులో వున్న నీ రూపాన్ని తీయడానికి
ఏ నీరు సరిపోలేదు
కన్నీటితో ప్రయత్నిస్తున్నాను
అయినా పోవట్లేదు
నయన వర్షమె హృదయం పై పడుతుంది
నీ రూపం పోవట్లేదు ఇంకా మెరుస్తుంది
ఏం చేయ మంటవు
ఎలా మరువ మంటావు

Thursday, March 15, 2012

నా చెలి రూపం

పౌర్ణమి వెన్నెల కంటే చల్లనైనది
మల్లెల కన్న తెల్లనైనది 
దేవుని ముందు పెట్టె దీపం కంటే అందమైనది
ఇంటి  ముందు వికసించే లేత గులాబి కంటే అమాయకమైనది
ప్రాణమున్న  పాలరాతి శిల్పం లాంటి రూపం నీది ప్రియ

Sunday, March 11, 2012

గమ్యం రాలేదు - ప్రయాణం ఆగలేదు

కాదు ఇది నీ అందానికి పరిక్ష
నా ప్రేమకు పరిష్కారం ఇది ప్రియా...

నా ప్రేమను కాదని కోలాహలం రేపెశావు
నవ్వుతు వుంటూనే నన్నుముంచేశావు
నేను ఒడి పోయాను నా కలలు చెదిరి పోయాయి
అయిన నీ ప్రేమ కోసమె ఎదురు చూస్తున్నాను

నువ్వు  అన్నావు ఓ సాయంకాలం 
ప్రతి రాత్రి చంద్రుడిని చూస్తానని
నేను కూడా చూస్తె మన కనులు అక్కడ కలుస్తాయని
నేను నేడు కూడా చూస్తున్నాను
రేపు కూడా చూస్తాను
అయిన నీ ప్రతిబింబం కనిపించట్లేదు
మరిచావా నా ప్రేమను.


Saturday, March 10, 2012

నీ ప్రేమ కోసం

నిన్ను పలకరించాలి అనుకుంటే పెదాలు కదలట్లేదు
నీతో మాట్లాడాలి అనుకుంటే మాట పెదవి దాటట్లేదు 
నా మౌన భావాలు తెలిసి కూడా ఎందుకు మౌనం వహిస్తున్నావు

నన్ను ప్రేమిస్తే బదులు పలుకు
నువ్వు కాదంటే ఎందుకే ఈ బ్రతుకు

చీకటి ఎదలో నీ తీయని స్మృతులతో వున్నాను
నీ ప్రేమ కోసం పరితపిస్తున్నాను...

Tuesday, March 6, 2012

ప్రేమ ఒక మత్తు



కనులు మూసి బ్రతుకు తున్నాను
నీ రూపం కనిపిస్తుంది
రెప్పలు తెరిస్తే చాలు నరకం అగుపిస్తుంది

నీళ్లు ఇంకిన నయనాలతో జీవిస్తున్నాను
అయిన నిన్నే ప్రేమిస్తున్నాను

ప్రేమించిన తర్వాత తెలిసింది
ప్రేమ ఒక మత్తు అని
అది లేకుంటే జీవితం వ్యర్ధమని

Monday, March 5, 2012

ప్రేమకు ఏది చిరునామా

నా హృదయ ప్రేమకు నీ చిరునవ్వే చిరునామా...

నీ చిరునవ్వు చూసి బ్రతికేస్తాను లేమ్మ...

Saturday, March 3, 2012

ఇదే "నా" ప్రేమ


నిను మరచి ఎలా వుండను నీ జ్ఞాపకాలే మనసంతా వున్నాయి
నీ  తరం కాదు నా కలలు చెడిపి వేయడం
నీకు చాల కష్టం నిజాలు పాతివెయ్యడం

కన్నీటి బరువుతో వున్నాను
నీ మోసంతో బాధ పడుతున్నాను 
మోసం నువ్వు చేశావు సిగ్గుతో తల నేను వంచాను.

లోకం  నా ప్రేమను ఎగతాలి చేసింది
నీ ద్రోహమే నన్ను జీవశ్శవంగా మార్చేసింది
దీనినే  ప్రేమ అంటే ఇలాగే బ్రతికేస్తాను 
నోరు కూడా విప్పను నా పెదవులు కుట్టేస్తాను.